డబ్బు.. డబ్బు.. డబ్బు మనం సంపాదించనంత వరకు దీని గురించి మనకు తెలియదు. సంపాదించడం మొదలు పెట్టిన తర్వాతే దీని గురించి మనకు తెలుస్తుంది. కానీ అప్పటికే సమయం మించిపోతుంది. సంపాదించే యావలో డబ్బు నిర్వహణ గురించి మనకు సమయం ఉండదు. దీంతో ఆ డబ్బును సరిగ్గా ఇన్వెస్ట్ చేయలేక అలా మన జీవితాన్నికొనసాగిస్తూనే ఉంటాం. కానీ డబ్బును సంపాధించడం కాదు ముఖ్యం.. ఆ డబ్బును ఎలా ఇన్వెస్ట్ చేస్తే మనకు మంచిది.. అది మన ముందు తరాల వారికి ఉపయోగపడుతుంది సరిగ్గా తెలుసుకోవాలి. దీనికి అనేక మార్గాలు ఉన్నాయి. అందుకు సరైన సలహదారుడిని సలహా తీసుకోవడం. లేదా ఇప్పుడు ఇంటర్నెట్ ప్రపంచంలో దొరకనిది అంటూ ఏమీ లేదు. వాటి కోసం అనేక బ్లాగులు, వెబ్ సైట్లు ఉన్నాయి. వాటి ద్వారా మన డబ్బును సరైన పెట్టుబడి మార్గాల్లో ఇన్వెస్ట్ చేయొచ్చు. ఆర్థిక మార్కెట్ గురించి తాజా సమాచారం కావాలంటే మీరు కొన్ని బ్లాగులు అనుసరించాలి. ఈ బ్లాగులు ఆర్థిక ప్రణాళిక, పెట్టుబడి, భీమా, పదవీ విరమణ, స్టాక్ మార్కెట్, రుణాలు, బంగారం, రియల్ ఎస్టేట్, ఆదాయం పన్ను, సమీక్ష వివిధ ఆర్థిక ఉత్పత్తులు గురించి సమాచారాన్ని అందిస్త...